telangana state beverages corporation offers 50 percent liquor as debt
Telecast Date: 30-08-2023 Category: Business Publisher:  SevenTV

 

తెలంగాణలో మద్యం అమ్మకాలను పెంచేందుకు బెవరేజెస్ కార్పొరేషన్ బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. కొనుగోలు చేసే మద్యానికి అదనంగా అందులో 50 శాతం లిక్కర్‌ను అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణదారులు లక్ష రూపాయల విలువైన మద్యం కొనుగోలుకు చలానా తీస్తే ఇప్పటి వరకు అంతే మొత్తం మద్యాన్ని సరఫరా చేసేవారు.


ఇటీవల మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలవగా ఒక్కొక్కరు ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షలు చెల్లించి మరీ పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారివద్ద నగదు నిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మద్యం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన బెవరేజెస్ కార్పొరేషన్ మద్యాన్ని అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది. లక్ష రూపాయల మద్యం కొనుగోలుకు చలానా తీస్తే దానికి అదనంగా రూ. 50 వేల విలువైన మద్యాన్ని సరఫరా చేయనుంది. అయితే, ఇందుకోసం పోస్టు డేటెడ్ చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే నెల 5 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆలోపు కొనుగోలు చేసే మద్యానికి ఇది వర్తిస్తుంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading