swiss parliament approves ban on burqas sets fine for violators
Telecast Date: 21-09-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇక మీదట స్విట్జర్లాండ్ లో నేరంగా పరిగణించనున్నారు. 151-29 ఓట్ల తేడాతో నేషనల్ కౌన్సిల్ ఈ బిల్లుకు తుది ఆమోదం చెపింది. ఇప్పటికే ఈ బిల్లుకు ఎగువ సభ కూడా ఆమోదం చెప్పినందున ఇక చట్ట రూపం దాల్చినట్టుగానే భావించొచ్చు.


స్విస్ పీపుల్స్ పార్టీ ఈ బిల్లును ప్రతిపాదించింది. నిజానికి రెండేళ్ల క్రితమే స్విట్జర్లాండ్ వ్యాప్తంగా దీనిపై ప్రజాభిప్రాయాన్ని (రెఫరెండమ్) స్వీకరించారు. నిఖాబ్ (బుర్ఖా)ధారణకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. ఇక ఇది చట్ట రూపం దాల్చినందున దీన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించనున్నారు. 1,000 స్విస్ ఫ్రాంక్ లను జరిమానాగా చెల్లించుకోవాలి. అంటే 1,100 డాలర్లు (రూ.91,300). బహిరంగ ప్రదేశాలతోపాటు, ప్రజలు వినియోగించుకునే ప్రైవేటు ప్రదేశాల్లోనూ ముక్కు, నోరు, కళ్లను కప్పి వేయకూడదని కొత్త చట్టం చెబుతోంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading