
ఆసియా క్రీడల్లో భారత్ బంగారు బోణీ కొట్టింది. తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత బృందం బంగారు పతకం సాధించింది. రుద్రాంక్ష పాటిల్, దివ్యాన్ష్, తోమర్‌తో కూడిన టీమిండియా ఫైనల్‌లో 1893.7 పాయింట్లు స్కోర్ చేసింది. దీంతో, గతంలో 1893.3 పాయింట్లతో చైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ఎయిర్‌రైఫిల్ జట్టులోని సభ్యులు రుద్రాంక్ష, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష మూడో స్థానం, తోమర్ ఐదో స్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకూ ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్క పతకాలు దక్కించుకుంది.
|