sharmila willl meet rahul gandhi in delhi
Telecast Date: 11-08-2023 Category: Political Publisher:  SevenTV

 

వైఎస్సార్‌‌ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం  జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తిన చేరుకున్న ఆమె.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం.

 

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌‌టీపీ విలీనంపై వీరితో షర్మిల చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు షర్మిల సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు చర్చ సాగుతోంది. పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగుతారని నేతలు చెబుతున్నారు.

 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading