semi finalslist in odi wc
Telecast Date: 13-11-2023 Category: Sports Publisher:  SevenTV

 

 

2023 వన్డే వరల్డ్ కప్ లో తొలి అంకం ముగిసింది. లీగ్ దశ ముగిసి... నాకౌట్ స్టేజ్ లోకి టోర్నీ అడుగుపెట్టింది. ఆడిన అన్ని మ్యాచ్ లు గెలిచి టీమిండియా సెమీస్ లో అడుగు పెట్టగా... ఎన్నో సంచలన ఫలితాల మధ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 15వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్ లో ఇండియాతో న్యూజిలాండ్ తలపడుతుంది. 16వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగే రెండో సెమీస్ లో సౌతాఫ్రికాను ఆస్ట్రేలియా ఢీకొంటుంది. 19వ తేదీన (ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. బలమైన జట్లు సెమీస్ కు చేరడంతో... ఫైనల్స్ కు ఎవరెవరు చేరుతారా అనే ఉత్కంఠ నెలకొంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading