rules ranjan movie update
Telecast Date: 12-09-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

కిరణ్ అబ్బవరం హీరోగా 'రూల్స్ రంజన్' సినిమా రూపొందింది. దివ్యాంగ్ - మురళీకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా నేహా శెట్టి అలరించనుంది. ఈ సినిమా విడుదలకు ముందుగా ఒక డేట్ అనుకున్నారు .. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు.

 

తాజాగా ఈ సినిమా టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ తో అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. 



అమ్రిశ్ గణేశ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కిరణ్ అబ్బవరం సినిమాలలో మంచి ఎంటర్టైన్ మెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఇక నేహా శెట్టికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading