
చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అని నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
"బ్రాహ్మణి గారూ... మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏంటంటే... మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అనే అంశాన్ని పరీక్షించుకునేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రతిపాదనలు చేయొద్దు. మీ ప్రతిపాదనను ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ కు గురవుతుంది. విద్యుచ్ఛక్తి అనేది కాంతివంతంగా ఉండాలే తప్ప ఎప్పుడూ కనెక్ట్ కాకూడదు అని అయాన్ రాండ్ అన్నాడు" అంటూ వర్మ తనదైన శైలిలో ఎక్స్ లో పోస్టు చేశారు.
|