pro kabaddi league auction 2023 telugu titans gets pawan sehrawat with over 2 and half crore
Telecast Date: 11-10-2023 Category: Sports Publisher:  SevenTV

ప్

 

రొకబడ్డీ లీగ్‌లో ఈసారి తెలుగు టైటాన్స్ దుమ్ము రేపేందుకు సిద్దమవుతోంది. గత సీజన్‌లో తమిళ్ తలైవాస్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆటగాడు పవన్ సెహ్రావత్‌ను సొంతం చేసుకున్న టైటాన్స్ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ప్రొ కబడ్డీ లీగ్  సీజన్-10 కోసం జరుగుతున్న వేలంలో అతడిని 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఫలితంగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇరాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రెజాను పుణెరి పల్టాన్ రూ. 2.35 కోట్లకు దక్కించుకుంది. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాళ్ల జాబితాలో రెజా చోటు సంపాదించాడు. డిసెంబరు 2న ప్రొకబడ్డీ లీగ్ సీజన్-10 ప్రారంభం అవుతుంది.



మిగతా ఆటగాళ్లు ఇలా..
* మణీందర్‌సింగ్‌       -    బెంగాల్ వారియర్స్ (రూ. 2.12 కోట్లు)
* ఫజల్‌                 -     గుజరాత్ టైటాన్స్ (రూ.160 కోట్లు)
*  సిద్ధార్థ్ దేశాయ్‌    -    హరియాణా స్టీలర్స్ (రూ. కోటి)
* మీటూశర్మ           -    యుముంబా (రూ. 93 లక్షలు)
* విజయల్ మలిక్‌    -    యూపీ యోధాస్ (రూ. 85 లక్షలు)
* గమాన్              -     దబాంగ్ ఢిల్లీ (రూ. 85 లక్షలు)
* చంద్రన్ రంజిత్    -    హరియాణా స్టీలర్స్ (రూ. 62 లక్షలు)
* రోహిత్ గులియా   -    గుజరాత్ టైటాన్స్ (రూ. 58.50 లక్షలు)
* వికాస్               -    బెంగళూరు బుల్స్ (రూ. 55.25 లక్షలు) 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading