praggnanandhaa falls in final hurdle magnus carlsen win fide chess world cup
Telecast Date: 25-08-2023 Category: Sports Publisher:  SevenTV

 

 

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వన్ మాగ్నస్ కార్ల్‌స‌న్ ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు. ఈ టోర్నీ ఆద్యాంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. గురువారం జరిగిన టై బ్రేక్‌లో చివ‌ర‌కు కార్ల్‌స‌న్ విజ‌యం సాధించి కెరీర్‌లో మొద‌టి ఫిడే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆకట్టుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హతం సాధించాడు.

చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. మంగళ, బుధవారాల్లో జరిగిన తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగిశాయి. అయితే గురువారం జరిగిన టై బ్రేక్ గేమ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ విజయం సాధించాడు. దీంతో భారత ఆటగాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టోర్నీ ఆద్యాంతం దూకుడైన ఆటతో ఆకట్టుకున్నాడు ప్రజ్ఞానంద. కానీ ఫైనల్‌లో మాత్రం ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ముందు అతడి వ్యూహాలు ఫలించలేదు. అయినా 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్‌ రన్నరప్‌గా అవతరించాడు ప్రజ్ఞానంద. ఫైనల్లో విజయం సాధించక పోయినా భారతీయులు గర్వపడేలా చేశాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహామహులను ఢీకొట్టగల ధీరుడు భారత్‌లో ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ప్రస్తుతం 18 ఏళ్ల వయసులోనే ఉన్న ప్రజ్ఞానంద.. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాడు.
 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading