ponguru priya vs narayana family
Telecast Date: 30-07-2023 Category: Political Publisher:  SevenTV

 

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారాయ‌ణ త‌మ్ముడి భార్య పొంగూరు కృష్ణ ప్రియ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. తాజాగా ఆమె నారాయ‌ణ‌పై చ‌ర్య‌లు కోరుతూ.. రాయ‌దుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం… తనను వేధిస్తూ… బెదిరింపులకు గురిచేస్తున్నా రని ఆమె ఆరోపించారు. ఈ మేర‌కు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పాటు.. ఆమె మ‌రో సెల్ఫీ వీడియో కూడా విడుద‌ల చేశారు.

తాను వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని పొంగూరు ప్రియ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు.

‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్‌ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading