my dear donga movie update
Telecast Date: 10-01-2024 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా 'ఆహా' దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు వినోదభరితమైన కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలోనే 'మై డియర్ దొంగ' అనే మూవీని వదలడానికి సన్నాహాలు చేస్తోంది. అభినవ్ గోమఠం - శాలినీ కొండేపూడి జంటగా నటించిన సినిమా ఇది. 

అడవిదొంగ గురించి విన్నారు .. టక్కరి దొంగ గురించి విన్నారు .. జేబుదొంగ గురించి విన్నారు .. 'మై డియర్ దొంగ' గురించి తెలుసుకోవాలంటే 'ఆహా'లోకి అడుగుపెట్టనున్న ఈ కంటెంట్ ను చూడవలసిందే అంటూ పోస్టర్స్ వదులుతున్నారు. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మహేశ్వర రెడ్డి నిర్మించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. 

అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించిన ఈ సినిమా, ఈ నెలలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ .. రొమాంటిక్ టచ్ తో కూడిన కథ ఇది. హాస్యాన్ని పండించడంలో అభినవ్ గోమఠం మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుందనేది చూడాలి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading