modi has come to know the true nature of jagan says raghu rama krishna raju
Telecast Date: 08-11-2023 Category: Political Publisher:  SevenTV

 

 

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తుండటంపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుందేశ్వరిపై తమ పార్టీ నేతలు కారుకూతలు కూస్తున్నారని, ఆ మాటలు వింటుంటే బాధ కలుగుతోందని అన్నారు. ఒక మహిళ, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని... ఇదేనా రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న రక్షణ అని ప్రశ్నించారు. ఒక్క మహిళను అవమానించినా రాష్ట్రంలోని అందరు మహిళలను అవమానించినట్టేనని చెప్పారు. 

ప్రధాని మోదీకి జగన్ నిజస్వరూపం తెలిసిపోయిందని... రాబోయే రోజుల్లో ఏపీలో 'జైలర్' సినిమా కనిపించబోతోందని అన్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ తన సొంత కుమారుడే పోలీస్ ఉన్నతాధికారిగా ఉండి దొంగతనాలకు పాల్పడుతుంటే... వాటిని చూడలేక కొడుకునే చంపేస్తాడని... ఏపీలో ఇలాంటి దృశ్యాలే కనిపించబోతున్నాయని చెప్పారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment
  • Comment
  • Preview
Loading