mobile hospital unit bhishma to be set up in ayodhya
Telecast Date: 20-01-2024 Category: Technology Publisher:  SevenTV

 

అయోధ్యలో శ్రీరామమందిర సందర్శనకు తండోపతండాలుగా తరలివచ్చే భక్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక విపత్తుల సమయాల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ‘భీష్మ’ పేరిట ఓ చిన్న మొబైల్ ఆసుపత్రిని అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సమగ్రవైద్య సేవలు అందించనున్నట్టు తెలిపింది. 

ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading