medicos warn against indiscriminate use of steroids for conjunctivitis
Telecast Date: 06-08-2023 Category: Health Publisher:  SevenTV

 

ప్రస్తుతం హైదరాబాద్‌లో కళ్లకలకల కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇది తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే, కొందరు సొంత వైద్యానికి దిగుతూ స్టెరాయిడ్లు వాడుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టెరాయిడ్ వాడకంతో తాత్కాలికంగా ఉపశమనం దక్కినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

కంజెక్టివైటిస్ లేదా ఐ ఫ్లూగా పిలిచే ఈ వ్యాధికి ఎడినో వైరస్ కారణమైనప్పుడే స్టెరాయిడ్ వాడకాన్ని మొదలెట్టాలని చెప్పారు. వ్యాధికి బ్యాక్టీరియా కారణమైనప్పుడు యాంటీ బయాటిక్స్ వాడటమే మేలని తేల్చి చెప్పారు. 20 నుంచి 30 శాతం కేసుల్లో మాత్రమే వ్యాధికి ఎడినో వైరస్ కారణమవుతోందని వెల్లడించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading