
ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. వారి పెంపుడు శునకం ‘ప్లూటో’ మరణించింది. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. కుక్క ఫొటోని పోస్ట్ చేసి, తన భావోద్వేగాలను అక్షరాల రూపంలో వ్యక్తీకరించే ప్రయత్నం చేశారు. నమ్రత పోస్ట్ పెట్టిన వెంటనే, వారి కుమార్తె సితార సైతం స్పందించింది.
‘‘ప్లూటో మా హృదయాల్లో నీవు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది’’అని నమ్రత పేర్కొంది. ‘బాధాకరమైన విషయం. మన్నించండి’ అంటూ ఓ అభిమని రిప్లయ్ ఇచ్చాడు. చాలా మంది యూజర్లు హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. ‘‘నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను’’అంటూ సితార సైతం ఇన్ స్టా లో పోస్ట్ పెట్టింది. దీనికి నమ్రత స్పందిస్తూ ‘‘మన హృదయాల్లో, ప్రార్థనల్లో అది ఎప్పటికీ జీవించి ఉంటుంది’’అని పేర్కొంది.
|