kodali nani car met with accident
Telecast Date: 20-10-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తన కుటుంబంతో కలిసి కొడాలి నాని దర్శించుకున్నారు. గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బ్యారికేడ్ ను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ కారులోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం చిన్నది కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ప్రమాదంలో కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో వైసీపీ నేతలు నానికి ఫోన్ చేసి ప్రమాదం వివరాలను తెలుసుకుంటున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading