kesineni chinni response on kesineni nani comments
Telecast Date: 05-01-2024 Category: Political Publisher:  SevenTV

 

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని.... పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని నాని తెలిపిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని ఆయన చెప్పారు. 

ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందిస్తూ... కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టుతో తనకు సంబంధం లేదని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పారు. 

మరోవైపు, ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నికి టీడీపీ అప్పగించింది. ఈ సారి విజయవాడ ఎంపీ టికెట్ కూడా చిన్నికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆయన పెద్ద ఎత్తున రాజకీయ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading