kcr files nomination in gajwel
Telecast Date: 09-11-2023 Category: Political Publisher:  SevenTV

 

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ కు కేసీఆర్ హెలికాప్టర్ లో వెళ్లారు. 

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading