kangana ranaut meets israel ambassador
Telecast Date: 25-10-2023 Category: Technology Publisher:  SevenTV

 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారితో తన సంభాషణ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో ఆమె షేర్ చేసింది. 

ఇజ్రాయెల్ లో తాజా పరిస్థితులపై ఆమె ఆ దేశ రాయబారితో చర్చించింది. ఇజ్రాయెల్ కు తన పూర్తి మద్దతు పలికింది. ‘‘నా హృదయం ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతోంది. మా హృదయాలూ రక్తమోడుతున్నాయి’’అంటూ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది. ‘‘ఇజ్రాయెల్ కు, యూదులకు నా మద్దతు విషయమై నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడుతుంటాను. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్న మాదిరే యూదులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. భారత్ హిందులకు ఎలా ప్రత్యేకమే, యూదులకు కూడా ప్రత్యేక దేశం ఉండాల్సిందే’’అని పేర్కొంది.  

హమాస్ ను నేటి రావణాసురగా కంగనా అభివర్ణించింది. ‘‘నేడు ఇజ్రాయెల్, భారత్ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. రావణ దహనం కోసం నేను నిన్న ఢిల్లీకి రాగా, ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్లి, నేటి కాలపు రావణ, హమాస్ వంటి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెలీలో భేటీ అవ్వాలనుకున్నాను. చిన్నారులు, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం హృదయాలను పిండేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’అని కంగనా రనౌత్ తన అభిప్రాయాలను పంచుకుంది. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading