hotel staff attacks family in hyderabad
Telecast Date: 02-01-2024 Category: Lifestyle Publisher:  SevenTV

 

హైదరాబాద్‌లో ఇటీవల ఓ హోటల్‌కు వెళ్లిన కుటుంబానికి దారుణ అనుభవం ఎదురైంది. బిర్యానీ బాలేదంటూ వెళ్లిపోతున్న వారిపై హోటల్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ కుటుంబం డిన్నర్ కోసం హోటల్‌కు వెళ్లింది. అయితే, సిబ్బంది తెచ్చిన బిర్యానీ రుచిగా లేకపోవడంతో వారు ఫిర్యాదు చేశారు. బిల్లు చెల్లించకుండానే తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సిబ్బంది వారిపై దాడికి దిగారు. ప్లాస్టిక్ పైపులు, ఇతర కర్రలతో మొత్తం ఐదుగురు కష్టమర్లను విచక్షణారహితంగా కొట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని అబిడ్స్ పోలీసులు తెలిపారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading