
దసరా పండుగ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించింది. దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును ఒకరోజు ముందుకు మార్చింది. అలాగే ఇంతకుముందు ప్రకటించిన సెలవునూ కొనసాగించింది.
|