cm kcr changes alampur candidate
Telecast Date: 08-11-2023 Category: Political Publisher:  SevenTV

 

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్ అసెంబ్లీకి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చారు. ఇదివరకు ఇక్కడి నుంచి అబ్రహం పేరును ప్రకటించారు. నామినేషన్ దాఖలుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ అలంపూర్ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. అబ్రహంను తప్పించి విజయుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అబ్రహం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడంపై అసంతృప్తి రాగాలు వినిపించడంతో విజయుడికి అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి తన అనుచరుడైన విజయుడికి టిక్కెట్ ఇప్పించుకోవడానికి చల్లా వెంకట్రామిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading