chikoti praveen joins bjp
Telecast Date: 07-10-2023 Category: Political Publisher:  SevenTV

 

కాసినో వ్యవహారాలు, ఫామ్ హౌస్ లో చిత్రవిచిత్రమైన జంతువుల పెంపకం తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ నేడు బీజేపీలో చేరారు. చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరే అంశం చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ బీజేపీలో అతడికి సభ్యత్వం అందించారు. 



ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు తదితరుల సమక్షంలో చికోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచుకున్నారు. బీజేపీ నేతలు చికోటి ప్రవీణ్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 



బీజేపీలో చేరిన అనంతరం చికోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరునాళ్లలో దారితప్పిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినట్టుగా ఉందని పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందటే బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ, కొంత సమాచార లోపం వల్ల చేరలేకపోయానని, ఇన్నాళ్లకు బీజేపీలోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading