bigg boss season 7 set to rock the audience soon
Telecast Date: 30-08-2023 Category: Entertainment

 

 

స్టార్ మా చానల్లో గతవారం వరకు ప్రసారమైన నీతోనే డ్యాన్స్ రియాలిటీ షో పూర్తయింది. ఇప్పుడా స్లాట్ లో బిగ్ బాస్ సీజన్-7 ప్రసారం కానుంది. సెప్టెంబరు 3 నుంచి బిగ్ బాస్ నయా సీజన్ షురూ అవుతుంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ అయింది. అయితే, ఎప్పట్లాగానే ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేది ఎవరన్న అంశంపై అత్యంత ఆసక్తి నెలకొంది. 

కంటెస్టెంట్ల విషయంలో గతంలో అనుసరించిన ఫార్ములానే బిగ్ బాస్ తెలుగు సీజన్ నిర్వాహకులు ఈసారి కూడా ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది. సినీ నటులు, సీరియల్ నటులు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, సింగర్లు... ఇలా వివిధ రంగాలకు చెందినవారిని కంటెస్టెంట్లుగా పంపుతుండడం తెలిసిందే. 

తాజా సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టేది వీళ్లేనంటూ ఈటీవీ ప్రభాకర్, షకీలా, నటి ఫర్జానా, సినీ నటుడు శివాజీ, యాంకర్ ప్రత్యూష, ప్రిన్స్ యావర్, యూట్యూబర్ అనిల్ గీలా, నటుడు క్రాంతి, బుల్లితెర నటి అంజలి, నటి శుభశ్రీ, సింగర్ భోలే షావలి, బుల్లితెర నటి ప్రియాంక జైన్, బాహుబలి నటి దామిని భట్ల, పల్లవి ప్రశాంత్, టీవీ యాక్టర్ అమర్ దీప్ చౌదరి, గుండమ్మ సీరియల్ నటి పూజా మూర్తి, బుల్లితెర నటుడు అర్జున్ అంబటి, ఆట సందీప్, జబర్దస్త్ తేజ, రియాజ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. 

కంటెస్టెంట్లు వీళ్లేనా అనేది తేలాలంటే బిగ్ బాస్ ప్రారంభం అయ్యేవరకు ఆగాల్సిందే.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading