as tomato prices soar farmer installs cameras on his field to prevent theft
Telecast Date: 08-08-2023 Category: Business Publisher:  SevenTV

 

పంట పొలాల్లోనూ అధునాతన టెక్నాలజీ వినియోగం పెరిగిపోతోంది. ఇటీవల నెల రోజులకు పైగా టమాటా ధరలు కొండెక్కి కూర్చోవడం తెలిసిందే. రూ.200 దాటి వెళ్లిన టమాటా ధర ఇప్పుడు రూ.100 లోపునకు వచ్చేసింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు టమాటా దిగుబడి వచ్చిన వారి ఇంట కనక వర్షం కురిసిందని చెప్పుకోవాలి. ఐదెకరాల పొలం ఉన్న వారికి కూడా టమాటా దిగుబడిపై రూ.50 లక్షలు, రూ.కోటి వరకు సమకూరిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అంత విలువైన పంట కావడంతో ఓ రైతు కొంచెం ఆధునికంగా ఆలోచించాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన శరద్ రావత్  తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వాటి సాయంతో నిఘా పెట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. టమాటా ధరలు భారీగా పెరిగిపోయిన రోజుల్లో.. టమాటా ట్రక్కులను చోరీ చేయడం కూడా వెలుగు చూసింది. అలాంటి రిస్క్ ఉండొద్దనే ఈ రైతు ఇలాంటి ఆలోచన చేశాడు. తన పొలంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.22 వేలు ఖర్చయినట్టు అతడు వెల్లడించాడు. పంటను కాపాడుకునేందుకు ఇది అవసరమేనన్నది అతడి అభిప్రాయం

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading