andole bjp candidate babu mohan son uday quits bjp and joins in brs
Telecast Date: 19-11-2023 Category: Political Publisher:  SevenTV

 

 

ప్రముఖ సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబూమోహన్‌కు కుమారుడు ఉదయ్ బాబూమోహన్ షాకిచ్చారు. ఈ ఉదయం ఆయన మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఉదయ్ ఆందోల్ టికెట్ ఆశించారు. బాబూమోహన్ కూడా కుమారుడికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. అయితే, బీజేపీ మాత్రం బాబు మోహన్‌కే టికెట్ కేటాయించింది.

పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ ఉదయం బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరిన బాబూ మోహన్ ఆ ఎన్నికల్లో ఆందోల్‌ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మరోమారు బీజేపీ ఆయనకే టికెట్ కేటాయించింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading