Swiggy instamarts guide on how to quit your job wins over internet
Telecast Date: 30-07-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

ఉద్యోగం పురుషలక్షణం. ఇది ఒకప్పటి సామెత. ఇప్పుడు ఉద్యోగం అందరి లక్షణం. ఆడ, మగ తేడా లేదు. ఇష్టం వచ్చినంత సేపు చదవడం, తర్వాత నచ్చిన కొలువు చేయడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. చేస్తున్న కొలువు దగ్గర ఏమాత్రం తేడా వచ్చిన వెనుక ముందు చూడటం లేదు. వెంటనే రాజీనామా లేఖను బాస్ మొఖం మీద కొట్టేస్తున్నారు. అయితే ఇలా రిజైన్ లెటర్ మొఖం మీద కొట్టే విషయంలో కొంతమంది వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. రాజీనామా విషయంలో వినోదం ఏంటి అనేనా మీ సందేహం? అయితే ఈ కథనం చదవండి.. మీరు నవ్వకపోతే మమ్మల్ని అడగండి.


ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన రోజుల్లో పని విధానం అనేది పూర్తిగా మారిపోయింది. పని చేసే చోటు ఏమాత్రం నచ్చకపోయినా ఉద్యోగులు సర్దుబాటు అనే విధానాన్ని కోరుకోవడం లేదు. పైగా యజమాని చేతిలో చివాట్లు తినాలి అని అస్సలు అనుకోవడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, పోటీ ప్రపంచంలో అవకాశాలు అమాంతం అందుబాటులోకి రావడంతో యువత దేన్నీ లెక్కచేయడం లేదు. చివరికి తన పని చేస్తున్న సంస్థకు సంబంధించి రాజీనామా లేఖ ఇవ్వడంలోనూ ఉద్యోగులు నవ్యతను పాటిస్తున్నారు. తాజాగా స్వీగ్గి ఇన్ స్టా మార్ట్ అత్యంత విచిత్రమైన రీతిలో రాజీనామా లేఖను రూపొందించింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీన్ని చూసిన వారెవరు నవ్వకుండా ఉండలేరు.


ట్విట్టర్లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్ స్టా మార్ట్ లో లభించే అన్ని స్నాక్ ఐటమ్స్ ను ఉపయోగించి రాజీనామా లేఖను రూపొందించింది. ఇప్పటివరకు ఈ పోస్టుకు లక్షకు పైగా వ్యూస్ లభించాయి. లెక్కకు మించిన విధంగా కామెంట్లు వస్తున్నాయి. ఈ లేఖ చాలామందిని ఆకట్టుకుంటున్నది. దీన్ని చూసి కొంతమంది నవ్వుతుంటే.. ఎంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారు. రాజీనామా లేఖను ఇంత తేలికగా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. మరికొందరైతే ఇన్ స్టా మార్ట్ లో చెప్పిన విధంగానే తమ రాజీనామాను వేడుకలాగా జరుపుకుంటామని చెబుతున్నారు. అయినా పని చేసే చోటు నచ్చనప్పుడు తలవంచుకొని ఉండాల్సిన ఖర్మ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నదే ఒక్క జీవితం.. ఇలాంటి అప్పుడు సర్దుకుని ఎలా బతకాలి అంటూ వారు లెక్చర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading