Second round of H1B visa lottery coming soon
Telecast Date: 29-07-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

2024 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా లబ్ధిదారుల ఎంపిక కోసం అమెరికా పౌరసత్వం, వలస సేవల శాఖ రెండో సారి లాటరీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం కోటా పూర్తయ్యేందుకు అదనపు లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన రిజిస్ట్రేషన్లతో ర్యాండమ్ పద్ధతిలో ఈ లాటరీ నిర్వహిస్తామని వెల్లడించింది. 

హెచ్-1బీ వీసాల తొలి లాటరీ రౌండ్ మార్చిలో జరిగింది. అమెరికా ఏటా 65 వేల వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికా యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులు చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటాయి. అమెరికా తాజా నిర్ణయంతో భారతీయ టెకీలకు లాభదాయకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading