NBK bhagavanth kesari movie update
Telecast Date: 01-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' సినిమాను రూపొందిస్తున్నాడు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలయ్య సరసన నాయికగా కాజల్ అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బాలయ్య మార్కు యాక్షన్ తోనే ఈ కథ నడవనుంది.

ఈ సినిమా కోసం బాలయ్య - కాజల్ కాంబినేషన్ లో ఒక మాస్ మసాలా సాంగును చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. జోరుగా హుషారుగా సాగే ఈ మసాలా సాంగ్ కోసం తమన్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్ ను ఊపేస్తుందని అంటున్నారు. ఈ బీట్ లో 'దంచవే మేనత్త కూతురా ..'బిట్ ను కూడా యాడ్ చేయనున్నారని అంటున్నారు. 

ఈ పాట కోసం ఆల్రెడీ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేకమైన సెట్ ను వేసినట్టుగా తెలుస్తోంది. ఈ కలర్ ఫుల్ సెట్ లోనే పాట మొత్తం చిత్రీకరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading