Jailer Rajinikanth says that there are no words only cuts
Telecast Date: 03-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 


 

 

వరుస ఫ్లాపులతో నిరాశ పరుస్తున్న సూపర్‌‌ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్  నిర్మించిన ఈ  సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. షో కేస్ పేరుతో తెలుగు ట్రైలర్‌‌ను యువ హీరో నాగ చైతన్య రిలీజ్ చేశాడు.  పవర్ ఫుల్  యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్‌‌ సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచేసింది. రజనీకాంత్ తన మార్కు నటన,  డైలాగ్స్‌తో ఆకట్టునున్నారు. 

‘ఈ డిసీజ్ వచ్చిన వాళ్లు పిల్లి పిల్లలా ఉంటారు.. కానీ ఒక్కోసారి పులిలా మారుతారు’ అంటూ డాక్టర్ బ్యాక్ గ్రౌండ్‌ వాయిస్‌ తో పరిచయమైన పాత్రలో రజనీకాంత్ తొలుత కుమారుడు, మనవడికి బూట్లు పాలీష్ చేస్తూ కనిపించారు. కానీ, ఆ తర్వాత విలన్స్‌ను చితక్కొడుతూ ‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. కోతలే..’ అంటూ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్‌ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. రజనీకి భార్యగా రమ్యకృష్ణ, హీరోయిన్‌గా తమన్నా, విలన్‌గా జాకీష్రాఫ్ నటించారు. సునీల్, మలయాళ స్టార్ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading