Mechanic Review and  Rating
Release Date: 10-02-2024 Publisher:  SevenTV

 

 

 

 

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

 

seventv rating: 3.5/5

 

నటీనటులు: mani saiteja ,rekanirosha, tanikala barani ,nagamahesh,samita gandhi,sandya janak, chatrapati shekar, funny, dorababu.

దర్శకుడు : muni sahekara

నిర్మాత: naga munna, upender, sridhar reddy

సంగీత దర్శకులు: vinod yajamanya

సినిమాటోగ్రాఫర్‌లు: sivaram prasad

ఎడిటింగ్: shiva

 

టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మేకల నాగ మునెయ్య క్రియేషన్స్ బ్యానర్ లో మేకల నాగ మున్నాయ్య ( మున్న ) నిర్మాత గా , కొండ్రాసి ఉపేందర్ , నందిపాటి శ్రీధర్ రెడ్డి సహా నిర్మాతలు గా , కృష్ణ వంశీ గారి వద్ద రైటర్ గా పని చేసిన ముని సహేకర రచన – దర్శకత్వం లో రూపొందిన చిత్రం ” మెకానిక్ – ట్రబుల్ షూటర్” అనే చిత్రం 02/02/2024 తేదీన విడుదల అయింది. ఇందులో మణి సాయి తేజ , రేఖ నిరోష హీరో హీరోయిన్స్ గా నటించగా తనికేళ్ళ భరణి , నాగ మహేష్ , సూర్య , కిరీటి , సునీత మనోహర్ , సంధ్య జనక్ , సమ్మెట గాంధీ , వీర శంకర్ , ఛత్రపతి శంకర్ , బిందాస్ భాస్కర్ , జబ్బర్థస్ట్ ఫణి తదితరులు నటించారు.

ముని సహేకర కొత్త దర్శకుడైన చిత్రాన్ని తెరకెక్కించిన తీరు , తన కలం నుంచి వచ్చిన మాటలు హృదయాలకు హత్తు కొనిపోయే విధంగా , ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తనికెళ్ల భరణి కి , హీరో కి మధ్య వచ్చే సన్నివేశాలు పతాక స్థాయి కి తీసుకొని వెళ్లుతాయి. గాలికి తిరిగే హీరో తన గమ్యం ఏమిటో తెలిశాక. ఊరి సమస్య పరిష్కారం కోసం , తనను తాను ఒక టూల్ గా మలుచుకునే సన్నివేశంలో దర్శకుడు చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా , భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న ఒక భర్న్నింగ్ ప్రాబ్లెమ్ ను , కమర్షియల్ పాయింట్ లో చూపించిన విధానం విషయంలో దర్శకుడిని ఖచ్చితంగా అభినందించ తగ్గ విషయం.

ఇటీవల తెలుగు చిత్రాల్లో నటిస్తూ భాగా పరిచయం అయిన నటుడు నాగ మహేష్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ గా నటించారు. గ్రామ ప్రెసిడెంట్ గా ఆయన ఆహార్యం , గంభీరం తెలుగు తెరకు కొత్త విలన్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హీరో మణి సాయి తేజ విషయంకి వస్తే , పెద్ద హీరో చేయవలసిన బరువైన పాత్ర పోషించాడు. మెకానిక్ గా ఫుల్ మాస్ లుక్ లో అలరించాడు. తెలుగు వెండి తెర కు మరో మాస్ హీరో వచ్చినట్టే అని చెప్పాలి. హీరో తను చేసిన ఫైట్స్ విషయంలో , కరెంట్ పోల్ మీద రియల్ గా కూర్చొని నటించిన విధానం చూస్తే , అతనికి నటన పై ఉన్న ఆసక్తి ని తెలియజేస్తుంది.

హీరోయిన్ రేఖ నిరోష తన గత చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో అందంగా కనిపిస్తుంది. తన అభినయంతో యువతను ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో సహజంగా నటించిందని చెప్పాలి.

ముఖ్యంగా నటుడు తనికెళ్ళ భరణి విషయంలో , సినిమా కి అతని పాత్ర అనడం కన్న , అది ప్రత్యేకమైన కథానాయకునిగా పాత్ర అని చెప్పాలి. ఆయన ఆ పాత్రకు జీవం పోశారు. ఆయన పాత్ర మంచి భావోద్రేకాలకి గురి చేస్తుంది.

ఈ చిత్రం నిర్మించిన నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ రోజు వస్తున్న రెగ్యులర్ కథలను కాకుండా , దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని నమ్మి , నిర్మించిన నిర్మాతల అభిరుచి , ఒక మంచి సినిమా నిర్మించాలాని, సినిమా పట్ల వాళ్లకు ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.

సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య కి , సాహిత్యాన్ని కూడా అందించిన దర్శకుడు ముని సహేకర పాటలు ఆల్రెడీ మంచి హిట్ అవ్వడంతో , ఈ చిత్రం విడుదల పై ప్రేక్షకులకి ఆసక్తి కలిగించింది. థియేటర్స్ కి వచ్చిన వాళ్ళు ఎక్కడ నిరుశ్చాహాపడరు. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్యం రీరికార్డింగ్ మరో అద్భుతమని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో సినిమా చూసేటప్పుడు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి.

ఓ ప్రక్క పెద్ద సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేస్తూ , ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ హీరో తో మంచి వర్క్ అవుట్ చేయించాడు.
ఎడిటర్ శివ షార్ప్ కట్టింగ్ , కెమెరా మ్యాన్ శివరాం పని తనం భాగుంది .

ఈ చిత్రం ద్వితీయార్థం లో వచ్చే సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేశావే పిల్ల .. నచ్చేశావే పిల్ల”.. పాట మరియు చివరలో వచ్చే కైలాష్ ఖేర్ పాట ఈ చిత్ర విజయంలో ప్రధాన భాగస్వామ్యం అయ్యాయని చెప్పాలి.

” గుడి కట్టగలను , ఆ గుడిలో విగ్రహం పెట్టగలను గానీ అందులోని దేవుడిని ఏ గుండె చేరద్దని ఆ దేవుడిని నేను శాచించాలేను ” ,
“నింగిలో మబ్బులా మెరిసి బ్రతకడం కాదు నేల పై చినికుగా కురిసి బ్రతకడమే జీవితం”.. ఈలాంటి డైలాగులు ఒక మార్క్ లా నిలిచిపోతాయి..
ఓవరాల్ గా , ఓ మంచి భావోద్రేకాలు కలిగి , హృదయాన్ని హత్తుకునే చిత్రాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ మెకానిక్ – ట్రాబుల్ షూటర్. ఇది నిజంగా విన్నింగ్ షూటర్.

 

రేటింగ్ :3.5/5

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading